కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాదం నేపథ్యంలో, వనస్థలిపురం పరిధిలోని చింతల్కుంటలో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 9 బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా స్వీపర్ సీట్లతో నడుస్తున్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. వరుస తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనలతో బస్సులు సీజ్ అవుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa