TG: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నీలం రాజు (30) పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు ఈ నెల 11న బావి వద్ద పురుగుమందు తాగి ప్రాణం తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతలో అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించి అతడిని హనుమకొండలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa