జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులైన వారు కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందినవారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa