సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో విషాదం చోటు చేసుకుంది. చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన 29 ఏళ్ల యువకుడు, బెజ్జంకి క్రాసింగ్ వద్ద రాజీవ్ రహదారిపై వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa