కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ఘోర ప్రమాదంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష అనే యాదాద్రికి చెందిన యువతి సజీవదహనమైంది. దీపావళి సందర్భంగా సొంతూరుకు వచ్చిన అనూష, బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లో బస్సు ఎక్కింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa