కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే బస్సు ఫిటినెస్‌పై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీన బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ, గతేడాది ఏప్రిల్‌లోనేఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ ముగిసింది. ఈ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 27 జనవరి 2024 నుంచి.. 9 OCT 2025 వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. 9 సార్లు నో ఎంట్రీ జోన్లోకి బస్సు ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ విభాగంలోనూ ఫైన్లు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa