పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్ 14 ఇయర్స్ కబడ్డీ పోటీలలో నిట్టూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రీజ విజయం సాధించింది. ఈ నెల 16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్లనున్న శ్రీజను బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, పిఈటి పిట్ట భాస్కర్, సిఆర్పి కుంబాల సుధాకర్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa