మాత, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా, ఫరూక్ నగర్ లోని ముస్లిం కమ్యూనిటీ హాల్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శనివారం పోషణ మాసోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్యశాఖ డిప్యూటీ అధికారి విజయలక్ష్మి పాల్గొని, గర్భిణీలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య సంరక్షణపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa