TG: అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంట వెళ్లిన చిన్నారి పొరపాటున ఆ వాహనం కిందనే పడి చనిపోయిన హృదయ విదారక ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మహాదేవపూర్ మండలం అంబటిపల్లికి చెందిన సింగనేని మల్లేశ్, భాగ్య దంపతుల కుమారుడు అనివిత్‌ను మంగళవారం పాఠశాల బస్సు ఎక్కించడానికి కుమార్తెతో కలిసి తల్లి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద కుమార్తె శ్రీహర్షిణి (3) పడి అక్కడిక్కడే మృత్యువాత పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa