మిర్యాలగూడ మండలంలోని జప్తివీరప్పగూడ గ్రామంలో బీజేపీ గ్రామ కమిటీ ఎన్నికలు జోరుగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు మరియు అసెంబ్లీ ఇంచార్జ్ సాధినేని శ్రీనివాసరావు, కన్వీనర్ సజ్జల నాగిరెడ్డి అధ్యక్షతన కొత్త కమిటీని ప్రకటించారు. గ్రామ స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
నూతనంగా ఎంపికైన గ్రామ బూత్ కమిటీలో నారాబత్తుల ఉదయ్ గ్రామ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా, మెట్ల మధుసూదన్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. అలాగే, పీ. రాంబాబుకు ఉపాధ్యక్ష పదవి లభించగా, మహేష్ కార్యదర్శిగా, నవీన్ ఖజాంచి (ట్రెజరర్)గా ఎంపికయ్యారు. ఈ కమిటీతో గ్రామస్థాయిలో బీజేపీ మరింత మద్దతు పొందనుంది.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఉదయ్ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో బీజేపీ బలోపేతానికి తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసేందుకు, కార్యకర్తల మధ్య ఐక్యత పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa