గాంధారి మండలం గుర్జాల్‌లో బుధవారం సొసైటీ ఆధ్వర్యంలో రూ. 13 లక్షల నిధులతో నిర్మించనున్న 150 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదాముల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఈ గోదాం గ్రామ స్థాయిలో అనేకమంది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందనీ, తద్వారా రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంలో సులభతరం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొని, గోదాం నిర్మాణానికి మద్దతు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa