పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐబి చౌరస్తా నుంచి రోడ్డు విస్తరణ పనులకు తోడుగా, పాత R&B గదులను కూల్చి కొత్త గదుల నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరమణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న వాణిజ్య సముదాయ గదులను కూల్చివేసి, వాటి వెనుక భాగంలో ఆధునిక సదుపాయాలతో గదులను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈ నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
పనులు వేగంగా పూర్తవ్వాలన్న దృష్టితో, కాంట్రాక్టర్‌కు తగిన సూచనలు కూడా చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, నిర్మాణ పనులను నాణ్యతతో మరియు వేగంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులూ, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa