హైదరాబాద్ నగరంలోని పిర్జాదీగూడా సమీపంలోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనుల కోసం తవ్విన పిల్లర్ గుంత ఒక దుర్ఘటనకు కారణమైంది. ఈత రాకపోవడంతో ఇద్దరు బాలురు ఆ గుంతలో పడిపోయి మృత్యువాతపడ్డారు.
ఈ ఘటనలో మృతులు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కుటుంబాలకు చెందినవారని పోలీసులు పేర్కొన్నారు. మృత బాలురిని అర్జున్ (వయస్సు 8 సంవత్సరాలు) మరియు మణికంఠ (వయస్సు 15 సంవత్సరాలు)గా గుర్తించారు. ఫైఓవర్ నిర్మాణ పనుల్లో తల్లిదండ్రులు పనిచేస్తుండగా, పిల్లలు ఆ ప్రాంతంలో ఆడుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం.
పిల్లర్ గుంతకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం, నిర్మాణ ప్రాంతం చుట్టూ సరైన హెచ్చరికా బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అధికారుల నుంచి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసు శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు పోవడం బాధాకరమని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa