గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కున్న కరెంట్ కష్టాలను ఏనాడూ కెసిఆర్ పట్టించుకోలేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా జానంపేటలో రైతులకు ట్రాన్స్ ఫార్మర్లు పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కెసిఆర్ పాలనలో ఎంతో మంది రైతులు ఇబ్బంది పడ్డారని, నేటి ప్రజా ప్రభుత్వం వచ్చాక రైతులకు కరెంట్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.