తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టిస్తోంది. చంద్రపూర్-బల్లార్షా అటవీ ప్రాంతంలో ప్రజలపై దాడులు చేస్తోంది. కాగా గత నాలుగు రోజుల్లోనే పులి ఐదుగురిపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు ఎటువైపు నుంచి పులి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలో అటవీ సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తునికాకు కోసం ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa