కన్న తల్లిని అడవిలోకి తీసుకెళ్లి మెడలోని ఆభరణాలు తీసుకొని వదిలేసిన కూతురు. తిండీతిప్పలు లేక రెండురోజులు అడవిలోనే తిరిగిన వృద్ధురాలు . జగిత్యాల - ఇస్లాంపుర వీధిలో ఉండే బుధవ్వకు ఈశ్వరీ అనే కూతురు ఉంది. అయితే రెండురోజుల క్రితం తల్లిని స్థానిక అడవిలోకి తీసుకెళ్లిన ఆమె మెడలోని ఆభరణాలు తీసుకొని పరారైన కూతురు. దీంతో బుధవ్వను శ్రీరాముల పల్లెలోని సఖి సెంటర్ కు తరలించారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కన్నతల్లిని అడవిలో వదిలేసి వెళ్లిపోయిన ఆ కూతురికి తగిన బుద్ధిచెప్పాలని స్థానికులు కోరుతున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa