బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఓ టెన్త్ విద్యార్థి కలలు అంతలోనే ఆవిరయ్యాయి. రాజన్న సిరిసిల్ల(D) బోయినపల్లి(M) మల్లాపూర్‌కి చెందిన ఆకుల రవి-రజిత దంపతులకు చిన్న కుమార్తె నాగ చైతన్య(15) ఇటీవల టెన్త్ పరీక్షలు రాసింది. అయితే ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్న చైతన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతి చెందింది. నిన్న విడుదలైన ఫలితాల్లో చైతన్య 510 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ఈ ఆనందం పంచుకునేందుకు తమ కూతురు లేదని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో ఈసారి రికార్డు స్థాయిలో 92.78 % మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా రెండు సంవత్సరాల కాలాన్ని మినహాయిస్తే ఇప్పటివరకు తెలంగాణలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతం. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 4,60,519 మంది ఉత్తీర్ణులయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa