అంతర్ రాష్ట్ర మోటార్ సైకిల్ దొంగల ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లాలోని దామరచర్ల, నల్లగొండ పట్టణం, నార్కెట్పల్లి, ఇబ్రహీంపట్నం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పార్క్ చేసి ఉంచిన ఖరీదైన బైకులను లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడేవారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa