తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల వర్షాలు పడుతుండగా పలు ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే వడదెబ్బతో 9 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం, KNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ముగ్గురు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు చనిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa