ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ కి చెందిన సమీద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు వైద్యం కోసం మంజూరైన లక్ష రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఎంఎల్ఏ జిఎంఆర్ చేతుల మీదుగా సమీద్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa