ఈసీఐ పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈసీఐ రాజీపడిందని, ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఓటింగ్ సరళిని రాహుల్ గాంధీ ఉదాహరణగా చూపించారు."మహారాష్ట్రలో అర్హులైన వయోజనుల సంఖ్య కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5:30 గంటలకు ఈసీఐ వెల్లడించిన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత 7:30 గంటల సమయానికి మధ్య దాదాపు 65 లక్షల ఓట్లు అదనంగా నమోదయ్యాయి. కేవలం రెండు గంటల్లో ఇన్ని ఓట్లు పోలవడం భౌతికంగా అసాధ్యం" అని రాహుల్ అన్నారు. ఒక ఓటరు ఓటు వేయడానికి కనీసం 3 నిమిషాలు పడుతుందని, ఆ లెక్కన చూసినా అర్థరాత్రి దాకా పోలింగ్ జరగాల్సి ఉంటుందని, కానీ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోగ్రఫీని తాము కోరితే, ఈసీఐ నిరాకరించడమే కాకుండా, అసలు వీడియోగ్రఫీని అడిగే అవకాశం లేకుండా చట్టాన్ని మార్చిందని కూడా ఆయన ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa