జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొత్తపల్లిగోరి మండల కేంద్రం శివార్లలోని పంట పొలాల్లో పెద్దపులి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. పొలం గట్టుపై ఠీవీగా నడుచుకుంటూ వెళుతున్న వ్యాఘ్రాన్ని చూసి వణికిపోయారు. అక్కడికి కాస్త దూరంలో ఉన్న ఓ రైతు తన మొబైల్ ఫోన్ లో పెద్దపులిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పొలం పనుల్లో మునిగి ఉన్న ఓ మహిళా రైతు పెద్దపులిని చూసి భయాందోళనకు గురయ్యారు. కాగా, పులి సంచారంపై కొత్తపల్లిగోరి గ్రామస్థులు సమాచారం అందించారని, ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తామని అటవీశాఖ అధికారులు మీడియాకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa