26.04.2026 నుండీ 02.05.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Tue, Apr 28, 2026, 11:41 AM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)ప్రారంభం మానసిక ప్రశాంతత తక్కువ. విద్యార్థులకు విద్య ఆసక్తి, ఏకాగ్రత పెంచుకోవాలి. పౌరుషం, నాయకత్వ లక్షణాలుఅధికం. ఆత్మీయులతో చర్చలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు అపార్థాలకి అవకాశం ఇవ్వరాదు. తల్లిఆరోగ్య శ్రద్ధ, వృత్తిపరమైన అంశాలు, పోటీ పరీక్షలు, విద్యా ప్రణాళికలు యందు అధిక శ్రమ. తొందరపాటు నిర్ణయాలు లేకుండా రుణ అంశాలలో, క్రయ విక్రయములో తగిన జాగ్రత్త తీసుకోవాలి. వారాంతంలో స్నేహసంబంధాలలో నూతన పరిచయాలు, గుర్తింపుగౌరవం, ఆహ్వానాలు లో పాల్గొనుట, ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. వ్యాపార వ్యవహారాల ఆకస్మిక నిర్ణయాలు. అయినప్పటికీ ప్రతి విషయంలో ఉద్వేగాలని అధిగమిస్తూ ఆచితూచి వ్యవహరించటం మంచిది. సుబ్రహ్మణ్యఆరాధన మేలు.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  వారం ప్రారంభంలో స్థిరాస్తులు క్రయ విక్రయాల లో, గృహ వాతావరణంలో చికాకులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో ఖర్చులు. వాహనాల విషయంలో, నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏకాగ్రత కొరకు హైగ్రీవాయ నమఃపఠన మంచిది. దూర ప్రదేశాలలో భూమి, పెట్టుబడి కొరకు, ఆత్మీయులతో సంప్రదిస్తారు. వృత్తి వ్యాపారలలో ఆర్థిక అనుకూలతలు మిశ్రమం. దూర ప్రయాణాలకు అవకాశం. విద్యార్థులు శ్రమతో, సహకారంతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యక్తిగత విషయాలలో ఖర్చులు ఆరోగ్యం శ్రద్ధ, జీవిత భాగస్వామి సహకారం. బంధువులతో కలయిక. సంతానమునకు వృద్ధి. పూర్వ బకాయిలు పొందుతారు. న్యాయపరమైన విషయాలు చర్చిస్తారు. అమ్మవారి ఆరాధన మేలు.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలో సామర్ధ్యంతో పనులు పూర్తి చేయడానికి చేసేప్రయత్నాలు, ప్రయాణాలు ఇబ్బందులు కలిగించిన, ధైర్యంగా శ్రమతో పట్టుదలతో ఆటంకాలని అధిగమిస్తూ పూర్తి చేస్తారు. ఉన్నత విద్య, దూరప్రయాణాలు, సామాన్యం. వృత్తిలో ఆర్థిక అభివృద్ధి, నూతన అవకాశాల కొరకు, విద్యా విషయాలలో, వాహన కొనుగోలుకై, రుణముల కొరకు ప్రయత్నం. ముఖ్య విషయాలలో ఆలస్యాలు నిర్ణయ సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయి. వారాంతం మాట విలువ, కుటుంబ ఆర్థిక అంశాలు, అనుకూలం. ఆత్మీయుల సహకారంతో, సమయస్ఫూర్తితో వివేక వంతమైన నిర్ణయాలు, ఆధ్యాత్మిక బలంతో చేపట్టిన పనులు సానుకూల పరుచుకుంటారు. అయినప్పటికీ మానసిక ప్రశాంతత ముఖ్యం. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


ప్రారంభంలో మానసిక పరిస్థితి చికాకులు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మాట పట్టింపులు ఘర్షణలు, ఆకస్మిక నిర్ణయాలు, ఆందోళనని అధిగమించాలి. ఆహార స్వీకరణ, నేత్ర ఆరోగ్య శ్రద్ధ అవసరం. వృత్తిపరమైన విషయాలలో గౌరవము హోదా అభివృద్ధి కొరకు శ్రమ అధికం చేస్తారు. వ్యక్తుల సహకారం సామాన్యం. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.ఆర్థికవృద్ధి కొరకు అవకాశాలు సద్వినియోగ పరుచుకోవాలి. లక్ష్యంతో పనులు పూర్తి చేస్తారు. భాగస్వామి, సంతానంతో భవిష్య ప్రణాళికలు, చర్చలు. కుటుంబసభ్యుల ఆరోగ్యము, అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి సారిస్తారు. వారాంతంలో స్థిరాస్తుల, వాహనాల విషయంలో, గృహ సంబంధ అంశాల మెరుగు కొరకై, ఖచ్చితమైన ప్రణాళికలు, ఖర్చులు,మార్పులు. నవగ్రహారాధన మేలు


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలో ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధ తీసుకోవాలి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. వైరాగ్యాన్ని అధిగమిస్తూ, వ్యక్తిగత విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. కుటుంబ పెద్దలతో, అధికారులతో కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాల కొరకు ఆకస్మిక ఖర్చులు, వాగ్దానాలు చేసేటప్పుడు, చర్చలలో బంధు వర్గంతో నిదానం అవసరం. పెట్టుబడులు, భాగస్వామ్య అంశాలు అభివృద్ధి కై తల్లిదండ్రులతో ఆలోచన చేస్తారు. వారాంతం దగ్గర ప్రయాణాలకి, ఆత్మీయుల కొరకు ఆకస్మిక ఖర్చులు. వృత్తి చేసే ప్రదేశాలలో  తోటి సిబ్బందితో, అధికారులైన స్త్రీలతో  ఓర్పు అవసరం. పూర్వపు ఆర్థిక విషయాలు, ఆలోచనలు కొంత వరకు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన,  మేలు.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో ప్రశాంతత కై ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రవచనాలు, క్షేత్ర సందర్శన కొరకు ప్రయాణాలు, ప్రణాళిక లేకుండా ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు తగుజాగ్రత్త తీసుకోవాలి. వృత్తిలో అధికారులతో, పెద్దలతో ఓర్పు అవసరం. తండ్రిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ. విమర్శలకి, సంబంధంలేని అంశాలకి దూరంగా ఉండాలి. దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలు, వార్తలు అందుకుంటారు. మధ్యలో కొత్త ఉత్సాహం, లాభకరమైన విషయాల కొరకు ఆలోచిస్తారు. ఆత్మీయులతో కలిసి వృత్తి, వ్యక్తిగత అభివృద్ధి లో ఆకస్మిక నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వారాంతల్లో ఆర్థిక కుటుంబ విషయాలు అనుకూలం, పెద్దల ఆశీస్సులు, జీవిత భాగస్వామి సహకారం. ఆదిత్య హృదయ పారాయణ మేలు.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


ప్రారంభంలో వృత్తి విషయాలలో, అభివృద్ధి కొరకు దూర ప్రదేశాలలోని వ్యక్తులసహకారం ఆశిస్తారు, వ్యాపార, భాగస్వామ్య వ్యవహారాలలో, దీర్ఘకాలిక పెట్టుబడులలో తగిన జాగ్రత్తలు అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తులతో, అధికారులతో వీలైనంతవరకు అహం సమస్యలకు దూరంగా ఉండాలి. నేత్ర ఆరోగ్య శ్రద్ధ, సమయానికి ఆహార స్వీకరణ, తగిన నిద్ర విశ్రాంతి, విషయాలలో నిర్లక్ష్యం తగదు. స్క్రీన్ టైమును, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. కుటుంబ వ్యక్తుల సహకారం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ. వారాంతంలో వృత్తిలో చలాకీగా, ధైర్యంగా ఉంటారు, స్త్రీల సహకారం , ఆధ్యాత్మిక ఆశీస్సులు అనుకూలం, ఆరోగ్యం అభివృద్ధి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. విష్ణుమూర్తి ఆరాధన మేలు


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


ప్రారంభంలో  వృత్తిలో ప్రశాంతత తక్కువ, ముఖ్య విషయాల్లో సంబంధంలేని వ్యక్తుల జోక్యం, ఇబ్బంది కలిగించడానికి చేసే ప్రయత్నాలు చికాకు కలిగిస్తుంది, పనిలో ఎదురయ్యే చిక్కులని ఉన్నత స్థాయి అధికార సహకారంతో అధిగమిస్తారు. న్యాయపరమైన విషయాలలో ప్రత్యర్థుల మీద విజయం, రోగ నిరోధక శక్తి అనుకూలం. వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆర్థిక విషయాలు, ఆలస్యమైనప్పటికీ బంధుమిత్రుల సహకారం, కమ్యూనికేషన్ బావుంటుంది. వారాంతంలో సంతానమునకు ఖర్చులు, శ్రమ, నిద్రలేమి, ప్రయాణాలు అధికం. జీవిత భాగస్వామి ఆరోగ్యవిషయంలో శ్రద్ధ. అయితే స్త్రీలతో విభేదాలు లేకుండా జాగ్రత్త అవసరం. అమ్మవారి ఆరాధన మేలు.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ప్రారంభంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు, పెద్దల ఆరోగ్యవిషయంలో శ్రద్ధ, ఆకస్మిక ఖర్చులు. ఆలోచనలలో ప్రశాంతత తక్కువ. సంతాన అభివృద్ధి విషయంలో, నూతన పెట్టుబడులకు, వృత్తిపరమైన మార్పులకు తీసుకునే నిర్ణయాలు, ఆచితూచి అడుగు వేస్తూ ఆత్మీయుల సంప్రదింపులతో ముందుకు వెళ్లడం అవసరం. కమ్యూనికేషన్ లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్వేగాలను, అధిక ఆత్మవిశ్వాసాన్ని అధిగమించాలి. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాల్లో, భాగస్వామ్య నిర్ణయాలు లాభము కన్నా శ్రమ ఒత్తిడి అధికం. స్థిరాస్తుల క్రయవిక్రయ ఆలోచనలు. వారాంతంలో ఆకస్మికంగా చిన్ననాటి మిత్రుల కలయిక, ముఖ్య సమాచారాలు తెలుసుకుంటారు. గణపతి ఆరాధన మేలు.


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


ప్రారంభంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ, ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు. ఆకస్మిక ప్రయాణాలు. గృహ వాతావరణం ప్రశాంతత తక్కువ, విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉండే తోబుట్టువులతో చర్చలు చేస్తారు, ఆత్మీయుల సహకారం ఆశిస్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలకు అవకాశం. సృజనాత్మకత, సంతానం అభివృద్ధి, వారికి నూతన అవకాశాలు, దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు. నైపుణ్యాలు పెంచుకుంటారు. శ్రమకి తగిన గుర్తింపు గౌరవం. ప్రియమైన వ్యక్తులతో అనుకూల వాతావరణం. సంతానంతో కలిసి చక్కని ఆలోచనలు చేస్తారు, సమయాన్ని సద్వినియోగ పరచుకుంటారు. సూర్యనారాయణ స్వామి ఆరాధన మేలు.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


ప్రారంభంలో న్యాయ సంబంధమైన విషయాలు, ఆరోగ్య, రుణముల అంశాలు, ఆలోచన చేస్తారు. ఆత్మవిశ్వాసం అధికం. ముఖ్య విషయాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కఠినంగా మాట్లాడకుండా, కమ్యూనికేషన్ తగిన జాగ్రత్తలు మేలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకరిస్తారు. మాట విలువ పెంచుకోవాలి, ఆకస్మికంగా ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేసిన అధిగమించ గలుగుతారు. అనవసర విషయాలకి, విమర్శలకి, దూరంగా ఉంటే ప్రశాంతత పెరుగుతుంది. వారాంతంలో కుటుంబ వ్యక్తుల సహకారం, ఆర్థిక అనుకూలత, మంచి ఆలోచనలు, సంతాన వృద్ధి ఉన్నప్పటికీ  వృత్తివ్యాపారల్లో తొందర నిర్ణయాలు, మాటల వల్ల ఘర్షణలు రాకుండా జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శన మేలు..


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో విద్యార్థులు మంచి ప్రణాళికతో, పోటీలలో ముందుకు వెళ్లాలి. ఆరోగ్య శ్రద్ధ, ఉపాసనతో పాటు ఆధ్యాత్మిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. వ్యాపార వ్యవహారాలు, కుటుంబ, ఆర్థిక అంశాలలో కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ మాటలలో అధిక ఆత్మవిశ్వాసం అపార్థములతో, అనుకోని ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ విషయం సరి చూసుకోవాలి. సాంఘిక సంబంధాలు పెంపొందించుకుంటారు, రుణములు, వాగ్దానాల విషయంలో ఆలస్యాలు అవకాశం. వారాంతంలో తోబుట్టువులతో, మిత్రులతో ముఖ్యమైన చర్చలు నిర్ణయాలు వాయిదా పడే అవకాశం. వృత్తి, సంతాన అభివృద్ధి, కొలిక్కిరాని ఆలోచనలు ఘర్షణాత్మకంగా ఉండకుండా మెడిటేషన్ ఉపకరిస్తుంది. దత్తాత్రేయ ఆరాధన మేలు 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM