19.04.2026 నుండీ 25.04.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)
 

by Suryaa Desk | Mon, Apr 20, 2026, 12:33 PM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)ప్రారంభం కుటుంబ సహకారం, నాయకత్వ లక్షణాలు, మంచి నిర్ణయాలు, విద్యార్థులకు కృషికి తగ్గ ఫలితాలు. ఉత్సాహం గృహములో శుభ వాతావరణం, నూతన వాహన లబ్ది. ఆర్ధిక విషయాలు వృద్ధి, విందు వినోదలు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రియమైన వారితో చక్కని సమయాన్ని గడుపుతారు. పెద్దల ఆశీస్సులు, దేవాలయ సందర్శన, మంచి కమ్యూనికేషన్, దగ్గర ప్రయాణాలు, ఆకస్మిక నిర్ణయాలు. మిత్రులతో, తోబుట్టువులతో చర్చలు. ఉన్నత విద్యాకై ప్రణాళికలు. వారంతములో తల్లి, విద్య, స్థిరాస్తులు, వాహనములు మొదలైన అంశాలలో అనుకూలత. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వృత్తిల అభివృద్ధి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు చేస్తుంది.


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


వారం ప్రారంభంలో  కుటుంబసభ్యుల ఆరోగ్యం కొరకు శ్రద్ధ, స్థిరాస్తుల, ప్రయాణాల నిమిత్తం , వ్యక్తిగత అవసరాలకై ఖర్చులు అధికం. నిద్రలేమిని అధిగమించి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మధ్యలో వ్యక్తుల అనుకూలత బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలం. మాట విలువ గౌరవం అనుకూలం, ఆకస్మిక ఆర్థిక అభివృద్ధి. వృత్తిలో, వ్యాపారంలో భాగస్వామ్య సహకారం. కమ్యూనికేషన్ బాగుంటుంది, నెట్వర్క్ పెంపొందించుకుంటారు. శ్రమతో అనుకున్నది సాధిస్తారు. భూమి స్థిరాస్తుల మీద పెట్టుబడుల కొరకు నిర్ణయాలు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు. వారాంతంలో లక్ష్యంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ మేలు.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


ప్రారంభంలో కుటుంబ ఆర్థిక అంశాలు, ఎదురుచూస్తున్న వర్తమానాలు, చిన్ననాటి మిత్రులతో చర్చలు, సమావేశాలు, నెట్వర్క్ అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక విషయాలలో ముఖ్యంగా సంతాన అభివృద్ధి, సృజనాత్మక విషయాలలో అధిక ఖర్చులను ప్రణాళికా పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాలి, వృత్తిపరంగా అధిక శ్రమ బాధ్యతలు సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళ్లే నేపథ్యంలో ఆరోగ్యం, ఆహారం, నిద్ర అంశాలపై తగిన శ్రద్ధ అవసరం. మాట విలువ గౌరవం అనుకూలం. శ్రమకి తగిన గుర్తింపు. మైత్రిబంధాలను పెంపొందించుకుంటారు. సౌమ్యంగా మాట్లాడి,వృత్తిలో ఆటంకాలను అధిగమించే ప్రయత్నాలు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. వారాంతం అనుకూలం. నవగ్రహ స్తోత్రం మేలు


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)ప్రారంభంలో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, కొత్త విధానాల్లో  మార్పులు చేయడానికి ప్రయత్నం. ఆర్థిక, కుటుంబ విషయాలు సామాన్యం. స్థిరాస్తులు నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు, ఎంతోకాలంగా ఆలస్యం, వాయిదా పడినవి ముందుకెడతాయి. మానసిక ప్రశాంతత బాగుంటుంది. సోషల్ సర్కిల్ ని పెంపొందించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు, విదేశీ అంశాలు, అనుకూలిస్తాయి. వస్తు, వస్త్ర లాభాలు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ అభివృద్ధి, వ్యక్తిగత నిర్ణయాలలో ఉద్వేగ ఘర్షణలను అధిగమించాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం. ఆత్మీయుల కొరకు, ఆధ్యాత్మిక విషయాలలో, ఆరోగ్యము శ్రద్ధకై అధిక ఖర్చులు చేస్తారు. విష్ణుమూర్తి ఆరాధన మేలు


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


ప్రారంభంలో ఆత్మవిశ్వాసం, పౌరుషం. ఉన్నత విద్య , ఆధ్యాత్మిక దూర ప్రయాణానికి, తండ్రి ఆరోగ్యం కొరకు ఖర్చులు శ్రద్ధ. వృత్తిలో కొత్త అవకాశాలు కొరకు ప్రయత్నం చేసే వారికి సామాన్యం. అధిక బాధ్యతలు. ఒత్తిడి సవాళ్లని వృత్తిలో ఎదుర్కొనే అవకాశం. ఐటీ రంగంలో వారికి మార్పులు. మంచి కమ్యూనికేషన్ తో ఆకస్మిక సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్లగలుగుతారు. ఊహించని ఖర్చులు ,ఆకస్మిక లాభాలకు అవకాశం. కొత్త లాభాలు కొరకు పెట్టుబడులు పెట్టడానికి తీసుకునే నిర్ణయాలలో అత్యంత జాగ్రత్త అవసరం. ఆత్మీయులని సంప్రదించటం మేలు. సంతానం అభివృద్ధి. వారి భవిష్యత్తు, విద్య కొరకు మంచి నిర్ణయాలు. సద్వినియోగపడే ఖర్చులు చేస్తారు. అమ్మవారి ఆరాధన మేలు.


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


ప్రారంభంలో తండ్రి ఆరోగ్యం అనుకూలం, ఉన్నత స్థాయి వ్యక్తులు యొక్క సహకారం, ఆకస్మిక ఆర్థిక విషయాలు, ఎదురుచూస్తున్న ప్రభుత్వ అంశాలు ముందుకు వెళతాయి. ఉన్నత విద్య అనుకూలిస్తుంది, విద్యార్థులకు పోటీలలో అనుకూలం కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి. పెద్దలు, గురువుల ఆశీస్సులు, దేవాలయ సందర్శన, ఆధ్యాత్మిక ప్రయాణాలు, ఉపాసన బలాన్ని పెంపొందించుకుంటారు. పుణ్య బలంతో ముందుకు సాగుతారు. గృహ వాహనాలు అనుకూలం, షాపింగ్ చేస్తారు. తోబుట్టువులు, తల్లితో చర్చలు. వృత్తిలో అభివృద్ధి కరమైన గౌరవం. వారాంతంలో మానసిక ప్రశాంతత, స్నేహ బృందంతో ప్రణాళికలు, సమయాన్ని సద్వినియోగ పరుచుకుంటారు. కృష్ణ మందిరాలు దర్శన మేలు.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


ప్రారంభంలో స్నేహ సంబంధాలు లాభిస్తాయి. వృత్తి,వ్యాపార పరంగా ఉన్నత స్థాయి, అధికారంలో ఉన్న వ్యక్తుల సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళతాయి. గుర్తింపు గౌరవం, మాట విలువ పెరుగుతుంది. జీవితభాగస్వామి ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు. రుణములకు సంబంధించిన విషయాలలో సానుకూల మార్పులు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలం. ఆత్మీయ వ్యక్తుల నుంచి బహుమానాలు అందుతాయి. వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలలో క్రింద సిబ్బంది సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు, మార్గదర్శకత్వం లభ్యం. వారాంతంలో వృత్తిలో, గృహ వాతావరణంలో ఆశించిన కీలక మార్పులు. సూర్యఆరాధన మేలు.


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


ప్రారంభం ప్రారంభంలో రోగ నిరోధక శక్తి, ఆరోగ్యం వృద్ధి. వృత్తిపరమైన విషయాలలో అధికారుల ఆదరణ, విద్యార్థులు పోటీలలో ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. స్నేహ సంబంధాలలో గుర్తింపు గౌరవం. వ్యాపార వ్యవహారాలు అనుకూలం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ, నూతన వస్తు కొనుగోలు. సంతాన అభివృద్ధి, విద్య విషయాలలో జీవిత భాగస్వామితో చర్చల్లో ఘర్షణలు, మాట పట్టింపులు అధిగమించాలి. ముఖ్యంగా స్త్రీలతో కమ్యూనికేషన్ లో జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ప్రశాంతత అవసరం. సంతానము యొక్క నిర్ణయాలు నిదానంగా ఆమోదిస్తారు. కుటుంబఖర్చులు అధికం. వారాంతం ఆధ్యాత్మిక ఆలోచనలు దేవాలయ సందర్శన, దగ్గర ప్రయాణాలు. హనుమాన్ చాలీసా మేలు.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


ప్రారంభంలో మంచి ఆలోచనలు ,నాయకత్వ లక్షణాలు, తండ్రి ఆరోగ్యం కొంత అనుకూలం, సంతాన అభివృద్ధి, పెట్టుబడుల ఖర్చులు. శత్రు రోగ రుణముల విషయంలో శ్రద్ధ, తత్ సంబంధ ఖర్చులు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల కొరకు అధిక శ్రమ పడతారు. సమయానికి ఆహార స్వీకరణ, ఆరోగ్య శ్రద్ధ అవసరం. వాహనం నడుపు వారు వాహనాల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు, భాగస్వామ్య వ్యవహారాలు కొరకు ఆకస్మిక ఆలోచనలు ఖర్చులు చేస్తారు. స్నేహ సంబంధాల విషయంలో గౌరవాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. వారాంతంలో సద్వినియోగపడే ఆకస్మిక ఖర్చులు. ముఖ్యమైన విషయాలు, చర్చలు కొద్దిపాటి వాయిదా. లక్ష్మీనారాయణ ఆరాధన మేలు.


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


ప్రారంభంలో గృహ వాతావరణం, పెద్దల ఆరోగ్య అంశాలు జీవిత భాగస్వామితో ఆలోచన చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో తగిన విధంగా, శ్రద్ధ దృష్టి సారించాలి. సంతాన అభివృద్ధి విషయంలో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. మంచి సహకారాన్ని అందిస్తారు. ఆత్మీయ వ్యక్తులతో అనుకూల వాతావరణం. మానసిక ప్రశాంతత. ధైర్యంగా నిర్ణయాలు, మీ అభిప్రాయాలు వ్యక్తీకరిస్తారు. కమ్యూనికేషన్ ఆశాజనకం. సృజనాత్మకత పెరుగుతుంది. స్థిరాస్తుల విషయాలు అనుకూలం. స్నేహితులు, క్రింది సిబ్బంది సహకరిస్తారు. నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారు, విదేశీ విషయాలు, అనుకూలం. తోబుట్టులతో అనుకూల చర్చలువారాంతం స్నేహ సంబంధాలు,ఆర్థిక అంశాల వృద్ధి. దత్త ఆరాధన మేలు.


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభం లక్ష్యాలని నిర్దేశించుకుని సామర్థ్యంతో, శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. దగ్గర ప్రయాణాలకు అవకాశం. విద్యార్థులు పోటీలలో అధిక శ్రమతో విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహాయం అనుకూలిస్తుంది. వాహన, స్థిరాస్తుల విషయాలు ఫలిస్తాయి. నూతన వాహనాల కొరకు చేసే ప్రయత్నాలు, కుటుంబంలో స్త్రీల సహకారం లభ్యం. ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, సంతానవృద్ధి కొరకు  కుటుంబ వ్యక్తులతో చర్చించి నిర్ణయాలకి ప్రయత్నం. మాటలవల్ల ఘర్షణ లేకుండా, తొందరపాటు ఆలోచనలు చేయకుండా కుటుంబము, వృత్తి విషయాలలో ముందుకు వెళ్లాలి. వారాంతం శ్రమతో పనులు సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


ప్రారంభంలో కుటుంబ, ఆర్థిక విషయాల పై  దృష్టి. మాటల్లో తీవ్రతను నియంత్రించుకోవాలి. నేత్ర, దంత ఆరోగ్య శ్రద్ధ అవసరం. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం. మానసిక ప్రశాంతత అవసరం. తోబుట్టువులతో, మిత్రులతో అనుకూల వాతావరణం. సామర్థ్యము తో పనిని పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్న, పట్టుదలతో పనిని పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంలో లోపం, నిర్ణయాలలో వాయిదాలు, ముఖ్య విషయాలు ఆలస్యంగా స్ఫురించటం వల్ల తాత్కాలిక ఇబ్బందులు. విద్యార్థులు విద్యా ప్రణాళికలు లో వాయిదా వేసే పద్ధతిని అధిగమించాలి. వారాంతంలో ఆశించిన వాతావరణం, ప్రశాంతత, ఉపాసన బలం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. విష్ణు మూర్తి ఆరాధన మేలు.


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే  రాశి   ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com

Latest News
Thunderstorms, rain likely in Bengal till May 5; day of vote counting to be affected Sat, May 02, 2026, 03:33 PM
China: Deeply entrenched corruption, exploitation erodes foundation of militaryChina: Deeply entrenched corruption, exploitation erodes foundation of military Sat, May 02, 2026, 03:32 PM
Women do same work as men but are paid less: Stark gender wage gap persists in rural B'desh Sat, May 02, 2026, 03:18 PM
India's medical tourism market to nearly double to 16.2 bn by 2030: Govt Sat, May 02, 2026, 03:12 PM
PM Modi to inaugurate Rs 1,695-crore textile park in Warangal on May 10 Sat, May 02, 2026, 03:06 PM