SBI YONO మెసేజ్‌తో కస్టమర్లలో కలకలం… ఏం జరుగుతోంది?
 

by Suryaa Desk | Wed, Apr 15, 2026, 09:11 PM

SBI YONO యాప్ వినియోగదారుల పేరుతో వస్తున్న ఆధార్ అప్‌డేట్ మెసేజ్‌లపై ఆందోళన నెలకొంది. మీ ఖాతా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే యోనో యాప్ పనిచేయదని చెబుతూ ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ మెసేజ్‌లో APK ఫైల్ లింక్ కూడా ఉండటంతో వినియోగదారులు గందరగోళానికి గురయ్యారు.అయితే ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని Press Information Bureau స్పష్టం చేసింది. ఇది సైబర్ నేరగాళ్లు సృష్టించిన మోసపూరిత ఉచ్చు మాత్రమేనని పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ ఇలాంటి APK ఫైళ్లు డౌన్‌లోడ్ చేయమని లేదా లింక్‌ల ద్వారా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయమని చెప్పదని స్పష్టం చేసింది.ఈ తరహా సందేశాలు ప్రజలను భయపెట్టి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న ఫిషింగ్ స్కామ్‌లలో భాగమని అధికారులు హెచ్చరించారు. OTP, పాస్‌వర్డ్ లేదా ఆధార్ వివరాలను ఫోన్ లేదా మెసేజ్ ద్వారా ఎప్పుడూ అడగరని కూడా తెలియజేశారు.వినియోగదారులు ఇలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు లేదా లింక్‌లపై క్లిక్ చేయకూడదని సూచించారు. తెలియని మూలాల నుంచి వచ్చే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం వల్ల మొబైల్ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.అలాంటి మోసపూరిత సందేశాలు కనిపిస్తే వాటిని report.phishing@sbi.co.inకు ఈమెయిల్ ద్వారా రిపోర్ట్ చేయాలని సూచించారు.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM