|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 11:23 AM
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలను ప్రతిపాదించింది. రూ.10 వేల పైబడిన డిజిటల్ లావాదేవీలను గంటపాటు నిలిపివేసి, ఆ సమయంలో వినియోగదారులకు రద్దు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అదనంగా, వృద్ధులు రూ.50 వేలకుపైగా పంపాలంటే నమ్మకస్తుల అనుమతి తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఖాతా భద్రత కోసం ‘కిల్ స్విచ్’ వంటి సదుపాయం కూడా అందించనుంది. అలాగే రూ.25 లక్షలకుపైగా డిపాజిట్లను ఖాతాలో జమ చేసే ముందు కఠిన పరిశీలన చేపట్టే విధంగా కొత్త నిబంధనలు సిద్ధం చేస్తోంది.
Latest News