TCS ఉద్యోగులకు సర్‌ప్రైజ్: ఏప్రిల్ 1 నుంచి జీతాల పెంపు!
 

by Suryaa Desk | Thu, Apr 09, 2026, 09:58 PM

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు తీపి కబుర్లు ప్రకటించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అన్ని గ్రేడ్‌లలోని ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు (Appraisal) అమలు కాబోతోంది అని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.ఈ పెంపు కంపెనీలోని అన్ని స్థాయి ఉద్యోగులకు వర్తించనుంది. అయితే, ఎంత శాతం జీతం పెరుగుతుందనే ఖచ్చిత వివరాలు ఇప్పటివరకు కంపెనీ ప్రకటించలేదు.
*భవిష్యత్తు సిద్ధత : టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్హుమల్ మాట్లాడుతూ, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ఉద్యోగులను సిధ్ధం చేయడానికి ఈ జీతాల పెంపు చేపట్టారని తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది.గత త్రైమాసికంలో (Q4 FY26) కంపెనీలో కొత్తగా 2,300 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరింది.
*ఫైనాన్షియల్ రిపోర్ట్ : మార్చిలో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ లాభం 12.2% పెరిగి రూ. 13,718 కోట్లుకు చేరింది. కంపెనీ ఆదాయం కూడా 9.6% పెరిగి రూ. 70,698 కోట్లుగా నమోదైంది.గత ఏడాదిలో మధ్యస్థాయి, దిగువ స్థాయి ఉద్యోగులకు 4.5% నుంచి 7% వరకు వేతన పెంపు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 10% వరకు పెంపు అందించబడింది. ఈ తాజా నిర్ణయం లక్షలాది TCS ఉద్యోగులకు లాభాన్ని అందించనుంది.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM