|
|
by Suryaa Desk | Thu, Apr 09, 2026, 10:31 AM
పుచ్చకాయ గింజలు పోషకాల నిధి అని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్, అర్జినిన్, మోనో, పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, శక్తిని అందించడానికి, రక్తహీనతను నివారించడానికి, చర్మాన్ని రక్షించడానికి తోడ్పడతాయి. మెటబాలిజాన్ని మెరుగుపరిచి, అలసటను తగ్గిస్తాయి. వీటిని మొలకెత్తించి, ఎండబెట్టి లేదా వేయించుకుని తినవచ్చు. ఉప్మా, సలాడ్స్, స్మూతీలలో కూడా కలుపుకోవచ్చు.
Latest News