|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 10:06 PM
దేశంలో Wind Energy రంగం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల కొత్త పవన విద్యుత్ సామర్థ్యం ఏర్పాటైనట్లు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.ఇది ఒకే సంవత్సరంలో నమోదైన అత్యధిక సామర్థ్యంగా నిలిచింది. 2016-17లో నమోదైన 5.5 గిగావాట్ల రికార్డును ఇది అధిగమించింది. ఈ పెరుగుదలతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం విండ్ ఎనర్జీ సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది.ప్రభుత్వ విధానాల్లో స్పష్టత పెరగడం, పోటీ పద్ధతిలో టారిఫ్‌ల నిర్ణయం, విద్యుత్ సరఫరా మౌలిక వసతులు సిద్ధంగా ఉండడం వంటి అంశాలు ఈ రంగం వృద్ధికి దోహదపడ్డాయని అధికారులు తెలిపారు.గత ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేసిన కొత్త విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో అధిక భాగం Karnataka, Gujarat, Maharashtra రాష్ట్రాల్లో ఉండటం విశేషం.
Latest News