|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 11:44 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాడికి మండలంలోని వేములపాడును సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్థానిక నాయకులు, అధికారులతో మాట్లాడారు. తర్వాత యాడికి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి నేటి సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
CM చంద్రబాబు ఈనెల 6న జిల్లాలో పర్యటించనున్నారు.
12.10కు యాడికి మండలంలోని వేములపాడు గ్రామంలోని హెలిపాడ్ వద్దకు చేరుకొంటారు.
12.20 వరకు ప్రజాప్రతినిధులను కలవనున్నారు.
12.30-2.00 వరకు యాడికిలో నిర్వహించే ప్రజా వేదికలో పాల్గొననున్నారు.
2.40కు పేండేకల్లు నీటి రిజర్వాయర్ పనులను పరిశీలించనున్నారు.
3.40-5.10 వరకు వేములపాడు గ్రామం చేరుకొని క్యాడర్తో సమావేశమై తిరుగు ప్రయాణమవుతారు.
Latest News