|
|
by Suryaa Desk | Sun, Apr 05, 2026, 11:54 PM
భూమి ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తోంది, కానీ చంద్ర మండలం దగ్గరగా రావడం తో పెద్దగా కన్పిస్తోంది, అని ఆర్టిమిస్ 2 వ్యోమగాములు ఆదివారం తెలిపారు.అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక చంద్ర యాత్ర విజయవంత దశకు చేరింది. ‘ఆర్టిమిస్’ పేరిట సాగే ఈ యాత్ర ఇప్పుడు చంద్రుడి పరిధికి చేరువవుతోంది. సోమవారం మూడు అమెరికన్ వ్యోమగాములు, ఒక కెనడియన్ వ్యోమగాముతో కూడిన బృందం తమ లక్ష్యానికి చేరతారని ఆశిస్తున్నారు. చంద్ర మండలంపై వారి పరిశీలన పదిరోజులపాటు కొనసాగుతుంది.53 సంవత్సరాల క్రితం జరిగిన అపోలో చంద్రయాత్రతో పోలిస్తే ఇది మరింత విజయవంతమని వీరు భావిస్తున్నారు. భూమిని దాటుకుని చంద్రుడి వద్దకు చేరుతున్నామని తెలియజేస్తూ, ఆ వ్యోమగాములు ఇప్పటి వరకు చేపట్టిన పరిశోధనల్లో అత్యంత విస్తృతమైనవి చేస్తామని తెలిపారు. అన్ని సరిగా సాగుతున్నా, వారి రాకెట్ టాయ్‌లెట్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
Latest News