పాపం పంత్… పగోడికి కూడా రావొద్దు ఈ దురదృష్టం!
 

by Suryaa Desk | Wed, Apr 01, 2026, 09:55 PM

ఐపీఎల్ 2026 సీజన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ (7) నిరాశాజనకంగా ఆరంభించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అతను దురదృష్టకరంగా రనౌట్ అయ్యాడు.ఓపెనర్‌గా వచ్చిన పంత్, ఒక బౌండరీతో మంచి ఆరంభం ఇచ్చాడు. అయితే మిచెల్ మార్ష్ ఆడిన షాట్ అతని ఔట్‌కు కారణమైంది. బంతి బౌలర్ చేతిని తాకి నాన్-స్ట్రైకర్ ఎండ్ స్టంప్స్‌ను తాకడంతో, అప్పటికే క్రీజ్ బయట ఉన్న పంత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ఈ ఘటన జరిగింది. మార్ష్ బౌలర్ వైపు షాట్ ఆడగా, బంతి అతని వేలికి తాకి స్టంప్స్‌ను కూల్చేసింది.ఈ సంఘటనతో పంత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన బ్యాడ్ లక్‌ను నిందించుకుంటూ పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఈ రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా పంత్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ, “పాపం పంత్… ఇలాంటి దురదృష్టం ఎవరికీ రావొద్దు” అని కామెంట్లు చేస్తున్నారు.పంత్ ఔట్ అయిన తర్వాత లక్నో జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. మిచెల్ మార్ష్ (28 బంతుల్లో 35)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా, ఎయిడెన్ మార్క్‌రమ్ (11)ను అక్షర్ పటేల్ పెవిలియన్ పంపాడు.డేంజరస్ నికోలస్ పూరన్ (8)ను లుంగి ఎంగిడి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆయుష్ బదోని (0), అబ్దుల్ సమద్ (36), మహమ్మద్ షమీ (1)లను నటరాజన్ ఔట్ చేశాడు.దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 18.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాజన్ తలో మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ సాధించారు.

Latest News
BJP files complaint against Mallikarjun Kharge over 'anti-RSS' remark in Assam, demands arrest Tue, Apr 07, 2026, 04:42 PM
BJP criticises Mamata Banerjee for remark on CRPF personnel Tue, Apr 07, 2026, 04:40 PM
EAM Jaishankar meets counterpart from St Kitts and Nevis, discusses areas of cooperation Tue, Apr 07, 2026, 04:33 PM
BWF mourns the passing of former president Craig Reedie Tue, Apr 07, 2026, 04:31 PM
Top 5 youngsters who stole the spotlight in IPL 2026 so far Tue, Apr 07, 2026, 04:24 PM