భారత్‌కు మరో రెండు ఎల్‌పీజీ నౌకలు!
 

by Suryaa Desk | Sat, Mar 28, 2026, 02:19 PM

భారతదేశంలో LPG నిల్వలను పెంచడానికి, పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధి నుండి బయలుదేరాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత నౌకాదళ యుద్ధనౌకలు ఈ నౌకలకు రక్షణగా ఉంటాయని సమాచారం. దేశ ఇంధన అవసరాలను తీర్చడానికి త్వరలో మరిన్ని నౌకలు రానున్నాయి. ఇప్పటికే మూడు LPG నౌకలు భారతదేశానికి చేరుకున్నాయి.హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు సంబంధించి ఎంవీ సమర్‌ శృతి నౌక విశాఖ పోర్టులో యాంకరేజీలో లంగర్‌ వేసి ఉంచారు. 65 వేల టన్నుల హైస్పీడ్‌ డీజిల్‌ను అన్‌లోడ్‌ చేస్తున్నారు. ఎంవీ స్వర్ణ సింధు అనే క్రూడ్‌ ఆయిల్‌ నౌక హెచ్‌పీసీఎల్‌ కోసం మరో రెండు రోజుల్లో చేరుకోనుంది. శుక్రవారం నాటికి రష్యా నుంచి జంబో నౌక 1,36,728 టన్నుల క్రూడ్‌ ఆయిల్‌తో విశాఖ పోర్టుకు చేరుకోనుంది. వచ్చే నెల 2, 5వ తేదీల్లో ఫౌండేయ (రష్యా నుంచి), దేశ్‌ గౌరవ్‌ (ముంద్రా పోర్టు) నౌకలు ముడి చమురుతో రానున్నాయి. ఈ నెల 1 నుంచి 25 వరకు ఇరాక్, రష్యా, ఖతార్, యూఏఈ, భారత దేశంలోని పలు పోర్టుల నుంచి పది చమురు నౌకలు విశాఖకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Latest News
Illegal LPG racket busted in Delhi's Palam; three arrested, 45 cylinders seized Thu, Apr 02, 2026, 11:39 AM
Avadh Ojha praises Amit Shah as strong-willed leader; predicts TMC's 'ouster' in Bengal Thu, Apr 02, 2026, 11:35 AM
US revamps Foreign Service selection, training Thu, Apr 02, 2026, 11:34 AM
Thunderstorm, rain alert across Rajasthan till April 4 Thu, Apr 02, 2026, 11:28 AM
Seoul shares down 3.6 pc on Trump's renewed Iran warning Thu, Apr 02, 2026, 11:25 AM