బాన పొట్ట కరిగించే రాగి అస్త్రం – ఇలా చేసేస్తే చాలు!
 

by Suryaa Desk | Fri, Mar 27, 2026, 08:57 PM

Ragi Soup: ఫిట్‌నెస్‌కు కొత్త మార్గం :మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునే వారు, అలాగే Diabetes సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో రాగిని చేర్చుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఎప్పుడూ రాగి ముద్ద, రాగి జావ తింటూ బోర్ అనిపిస్తే, “రాగి సూప్” మంచి టేస్టీ & హెల్తీ ఆప్షన్. కేవలం 10 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకునే ఈ సూప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
*కావలసిన పదార్థాలు:రాగి పిండి – పావు కప్పు,వెన్న (బటర్) – 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి తరుగు – 1 టేబుల్ స్పూన్,పచ్చిమిర్చి తరుగు – అర టేబుల్ స్పూన్ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్లు,మిక్స్ వెజిటబుల్స్ (క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, బఠానీ, క్యాబేజీ) – ఒక్కోటి 1 టేబుల్ స్పూన్,మిరియాల పొడి – అర టీస్పూన్,సొంటి పొడి – పావు టీస్పూన్,నిమ్మరసం – అర చెక్క,ఉప్పు, కొత్తిమీర – తగినంత
*తయారీ విధానం:
-ముందుగా రాగి పిండిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీరు కలిపి గడ్డలు లేకుండా పలుచగా కలపాలి.
-ఇప్పుడు స్టవ్‌పై గిన్నె పెట్టి బటర్ వేసి కరిగిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత కూరగాయల ముక్కలు వేసి అవి కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. ఆపై ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా పంచదార వేసి కలిపి మూడు కప్పుల నీళ్లు పోయాలి.
-నీళ్లు మరిగే సమయంలో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ, గడ్డలు పడకుండా కలుపుతూ ఉండాలి.
-సూప్ కాస్త చిక్కబడిన తర్వాత సొంటి పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లి, నిమ్మరసం పిండితే వేడి వేడి రాగి సూప్ సిద్ధం.
*ఆరోగ్య ప్రయోజనాలు:
-ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది
-కాల్షియం అధికంగా ఉండి ఎముకలు బలపడతాయి
-రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు తగ్గుతాయి
-ఐరన్ అందించడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది
-చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
-జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది
-చర్మాన్ని యవ్వనంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి
-మంచి నిద్రకు, మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది

Latest News
RBI postpones capital market exposure framework to July 1 Tue, Mar 31, 2026, 11:32 AM
Vietnam's capital logs 29 COVID-19 cases since start of year Tue, Mar 31, 2026, 11:27 AM
PM Modi inaugurates Samrat Samprati Museum in Gandhinagar Tue, Mar 31, 2026, 11:15 AM
Cop dies of accidental firearm injury in J&K's Shopian Tue, Mar 31, 2026, 11:00 AM
PM Modi to inaugurate Samrat Samprati Museum, launch key development projects in Gujarat today Tue, Mar 31, 2026, 10:47 AM