|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 10:30 AM
ఏఐ దుర్వినియోగంపై సుప్రీకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చాట్ జీపీటీ సృష్టించిన నకిలీ కేసులను నిజమని నమ్మి కోర్టులు ఉత్తర్వులు ఇచ్చిన ఘటనలను ప్రస్తావించింది. ఏపీలో ట్రయల్ కోర్టు జడ్జి, బాంబే హై కోర్టులో కక్షిదారు కల్పిత తీర్పులను వినియోగించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు అటార్నీ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఏఐ సమాచారాన్ని ధృవీకరించడం, ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగం అవసరమని సూచించింది.
Latest News