|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 10:12 PM
డెబిట్, క్రెడిట్ కార్డులు వాడే వారికి బిగ్ అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మీరు కార్డు ఉపయోగిస్తుంటే, ఈ మార్పుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.మరో కొన్ని రోజుల్లో అమల్లోకి వచ్చే ఈ రూల్స్ వల్ల కార్డులపై లభించే అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటివరకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన కొన్ని ప్రయోజనాల్లో కోతలు విధించడంతో వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ మార్పులు ఏమిటి? ఎలాంటి సదుపాయాలు తగ్గుతున్నాయి? చూద్దాం.
*ఉచిత లాంజ్ సౌకర్యానికి కోత :చాలా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఎయిర్‌పోర్టుల్లో ఉచిత లాంజ్ యాక్సెస్ లభించేది. అయితే ఇప్పుడు ఈ సదుపాయాన్ని కొన్ని కార్డులపై పూర్తిగా నిలిపివేస్తుండగా, మరికొన్నింటిపై పరిమితులు విధిస్తున్నారు. ఈ ఫ్రీ లాంజ్ సేవలు బ్యాంకులకు అధిక ఖర్చుతో కూడుకున్నవిగా మారడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రివార్డ్స్ సిస్టమ్‌లో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
*ఈ కార్డులపై ప్రభావం :రూపే ప్లాటినం డెబిట్ కార్డులపై దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్ సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి నిలిపివేయనున్నారు. దీనిపై బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయి.రూపే సెలెక్ట్ కార్డులకు కూడా పరిమితులు విధించబడుతున్నాయి. అంటే, ఒక నిర్దిష్ట ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తదుపరి త్రైమాసికంలో లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.అలాగే యాక్సిస్ బ్యాంక్ ఎయిర్‌టెల్ క్రెడిట్ కార్డుపై ఇప్పటివరకు ఉన్న నాలుగు ఉచిత దేశీయ లాంజ్ యాక్సెస్ సదుపాయాలను తొలగించనున్నారు. అయితే ఎయిర్‌టెల్ పేమెంట్స్‌పై 25% క్యాష్‌బ్యాక్, యుటిలిటీ బిల్లులపై 10% క్యాష్‌బ్యాక్ కొనసాగుతాయి.ఇప్పటివరకు స్విగ్గీ, జొమాటో, బిగ్‌బాస్కెట్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లపై లభించే 10% క్యాష్‌బ్యాక్ ఇకపై ఉండదు. దాని బదులు జొమాటో, బ్లింకిట్, డిస్ట్రిక్ట్ వంటి యాప్‌లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది.మొత్తంగా రూపే ప్లాటినం, రూపే సెలెక్ట్ కార్డులపై ఫ్రీ లాంజ్ యాక్సెస్ తగ్గిపోవడంతో, వినియోగదారులు ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇతర కార్డులపై మాత్రం బ్యాంకుల నిబంధనల ప్రకారం కొన్ని సదుపాయాలు కొనసాగుతాయి.ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్న నేపథ్యంలో, కార్డ్ యూజర్లు తమ కార్డు ప్రయోజనాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.