|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 01:50 PM
AP: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద టిప్పర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు సజీవదహనం కావడం పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాద కారణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Latest News