|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 03:08 PM
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Latest News