|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 02:21 PM
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా, ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రిని కలిసి, రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్స్ లకు 59 రూపాయల రెంటల్ ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి, వారి అర్జీలను స్వీకరించారు.
Latest News