|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 03:36 PM
పర్యాటక రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు వేదికగా మారుతున్న భీమిలి నియోజకవర్గంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. భీమిలి 8వ వార్డు పరిధిలో పీవీఆర్ గ్రూప్, హోటల్ హయత్ కన్సార్టియం సంయుక్తంగా నిర్మించనున్న ‘హయత్ సెంట్రిక్’ ఐదు నక్షత్రాల హోటల్ శంకుస్థాపన కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ శ్రీ హరేందిర ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Latest News