|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 01:47 PM
విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గణబాబు శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీహరిపురం మెయిన్ రోడ్ సమీపంలోని ఈద్గా, ఖబ్రిస్థాన్ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన ముస్లిం సమాజానికి పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రంజాన్ పండుగ క్రమశిక్షణ, దాతృత్వం, సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. నియోజకవర్గంలోని ముస్లింల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
Latest News