|
|
by Suryaa Desk | Tue, Mar 17, 2026, 12:36 PM
కర్నూలు జిల్లా మంత్రాలయం పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే విధానంపై టీడీపీ నాయకులు అవగాహన కల్పించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో, కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతలలో రూ. 20 వేలు అందిస్తుందని వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ చైర్మన్ నరసప్ప, సీఈఓ నరసింహమూర్తి, టీడీపీ గ్రామ అధ్యక్షులు నరసింహులు పాల్గొన్నారు.
Latest News