Iranలో ఉన్న భారతీయులకు కీలక హెచ్చరిక.. బోర్డర్ వైపు వెళ్లొద్దని సూచన!
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 09:40 PM

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో Iranలో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో Tehranలోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.అలాగే అవసరమైతే సరిహద్దులు దాటి ఇతర దేశాల ద్వారా స్వదేశానికి వెళ్లాలని సూచించింది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా రాయబార కార్యాలయంతో సమన్వయం లేకుండా ఎవరూ కూడా సరిహద్దు దాటకూడదని స్పష్టం చేసింది.రాయబార కార్యాలయం సహకారం లేకుండా సరిహద్దు దాటి దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తే ఇమిగ్రేషన్ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని సందర్భాల్లో ఒకసారి దేశం దాటిన తర్వాత కూడా తాము సహాయం చేయలేని పరిస్థితులు రావచ్చని తెలిపింది. అందుకే ఇరాన్‌లో ఉన్న భారతీయులు తప్పనిసరిగా రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి వారి సూచనలు పాటించాలని సూచించింది.ఇదిలా ఉండగా, Iran నుంచి ఇప్పటివరకు 550 మంది భారతీయులు Armeniaకు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి Randhir Jaiswal తెలిపారు. వీరిలో 284 మంది పర్యాటకులు ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మరో 90 మంది భారతీయులు Azerbaijanకు వెళ్లినట్లు వెల్లడించారు.యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో Strait of Hormuzను ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మార్గంలో నౌకల రాకపోకలు సురక్షితంగా కొనసాగేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని Donald Trump ఇటీవల పిలుపునిచ్చారు. అయితే ఈ అంశంపై అమెరికా–భారత్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని రణ్ధీర్ జైశ్వల్ స్పష్టం చేశారు.

Latest News
ECI transfers 19 police officials in West Bengal Tue, Mar 17, 2026, 04:03 PM
ECI transfers 19 police officials in West Bengal Tue, Mar 17, 2026, 03:52 PM
India is entering new phase in global trade, says Piyush Goyal Tue, Mar 17, 2026, 03:43 PM
Maruti Suzuki India gets Rs 5,786 crore tax notice Tue, Mar 17, 2026, 03:39 PM
NPCI expands its UPI acceptance in Sri Lanka to boost economy, tourists' experience Tue, Mar 17, 2026, 03:32 PM