జల్ జీవన్ మిషన్ కింద భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాల్వ శ్రీనివాసులు హర్షం వ్యక్తం
 

by Suryaa Desk | Mon, Mar 16, 2026, 07:51 PM

రాయదుర్గం నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేలా, 'జల్ జీవన్ మిషన్' కింద భారీ తాగునీటి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. డి.హీరేహాళ్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ 2019లోనే తాము ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశామని, కానీ ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతో దీనిని పక్కన పెట్టి సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.వెనకబడిన రాయలసీమకు దక్కాల్సిన అభివృద్ధిని అడ్డుకున్న జగన్‌రెడ్డిని ఈ ప్రాంతం నుంచి వెలివేయాలని, ఆయన మళ్ళీ అధికారం దరిదాపుల్లోకి రాకుండా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టు మంజూరైనందుకు కృతజ్ఞతగా మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ చిత్రపటాలకు పాలతో అభిషేకం నిర్వహించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

Latest News
Infosys stock hit 6-year low, market valuation drops below Rs 5 trillion Tue, Mar 17, 2026, 02:50 PM
US allows Iranian oil flow amid war: Bessent Tue, Mar 17, 2026, 02:44 PM
Two Baloch civilians extrajudicially killed, other 2 abducted by Pakistani forces Tue, Mar 17, 2026, 02:38 PM
FIFA World Cup 2026 uncertainty grows as Iran eyes venue change Tue, Mar 17, 2026, 02:29 PM
Domestic fundamentals to drive Indian equities despite global tensions Tue, Mar 17, 2026, 02:21 PM