|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 11:15 AM
అనంతగిరి మండలంలో బొర్రా గుహలకు వెళ్లే మార్గంలో గేటువలస వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన కింద భాగంలోని సైడ్ దిమ్మలు దెబ్బతినడంతో వాహనాలు వెళ్లే సమయంలో కదలికల శబ్దాలు వినిపిస్తున్నాయి. దీనితో స్థానికులతో పాటు గుహలను దర్శించేందుకు వచ్చే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు వచ్చే ఈ మార్గంలో వంతెన మరమ్మత్తులు లేదా కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
Latest News