|
|
by Suryaa Desk | Mon, Mar 16, 2026, 10:18 AM
ఏపీలోని అంగన్వాడీ కేంద్రాలకు శుభవార్త చెప్పింది. అన్ని కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేయనున్నట్లు కేంద్ర సంస్థ ఈఈఎస్ఎల్ తెలిపింది. తొలి దశలో ఇప్పటికే 11,400 స్టవ్‌లు అందజేసినట్లు పేర్కొంది. మరో 44,346 అంగన్వాడీ కేంద్రాలకు త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ చర్యతో ఎల్పీజీ వినియోగం తగ్గి ప్రతి సంవత్సరం సుమారు రూ.24 కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపింది. అలాగే దాదాపు 28 వేల టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇండక్షన్ స్టవ్‌ల వల్ల అగ్నిప్రమాదాలు ఉండవని, సిబ్బంది సురక్షితంగా వంట చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Latest News