|
|
by Suryaa Desk | Sun, Mar 15, 2026, 02:53 PM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఏపీలో విద్యుత్ వినియోగంపై కనిపిస్తోంది. వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రజలు ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు ఎక్కువగా ఉపయోగించడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. మార్చి 7న రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 274.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.15 శాతం అధికం. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కూడా డిమాండ్ పెరగడానికి కారణమవుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే మే నాటికి విద్యుత్ వినియోగం 300 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Latest News