|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:24 PM
ఒకవైపు.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు, భయాందోళనలకు కారణం అవుతున్న వేళ.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య కవ్వింపులు మాత్రం ఆగడం లేదు. అమెరికా-దక్షిణ కొరియా దేశాలు వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహించిన వేళ ఉత్తర కొరియా కవ్వింపులకు పాల్పడింది. ఇప్పటికే తరచూ మిసైల్ టెస్ట్‌లు చేపడుతున్న ఉత్తర కొరియా.. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. శనివారం రోజున ఒకేసారి ఏకంగా 10 క్షిపణులను ప్రయోగించింది. ఈ ఉత్తర కొరియా మిసైళ్లకు సంబంధించిన విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
తమ రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ఉత్తర కొరియా ఈ మిసైళ్లను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొంది. అయితే ఈ మిసైళ్లు మాత్రం ఎంతదూరం ప్రయాణించాయి అనేది మాత్రం తమకు తెలియదని వెల్లడించింది. ఇక దక్షిణ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు.. ఉత్తర కొరియా మిసైళ్లకు సంబంధించిన పరిణామాలపై జపాన్ రక్షణ శాఖ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ప్రయోగించిన మిసైళ్లు.. తమ దేశ ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడినట్లు వెల్లడించింది.
మరోవైపు.. ఈ వారం మొదట్లో కూడా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం గమనార్హం. ఓ వార్ షిప్ నుంచి ఉత్తర కొరియా తీరానికి సమీపంలో ఉన్న దీవులపై క్రూజ్ మిసైళ్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జు యేతో కలిసి ఇక ఆ మిసైల్ ప్రయోగ పరీక్షలను కాన్ఫరెన్స్ హాల్ నుంచిలో వీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. ఉత్తర కొరియాపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించేందుకే ఇక ఈ మిసైల్ ప్రయోగ పరీక్షలను ఈ శక్తిమంతమైన క్షిపణులతో ప్రయోగాలు చేస్తున్నట్లు కిమ్ జోంగ్ ఉన్ ఇప్పటికే ప్రకటించారు.
బాలిస్టిక్ ప్రొజెక్టైల్స్‌ను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు గుర్తించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇవి బాలిస్టిక్ మిసైల్ టెస్ట్‌లు కావచ్చని పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా వార్షిక సైనిక విన్యాసాలు ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో నిర్వహిస్తున్న విన్యాసాల సమయంలో ఉత్తర కొరియా ఈ పరీక్ష చేసింది.
Latest News