|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 10:00 PM
నేరుగా ఓటీటీలో విడుదలైన Mrs. సినిమా విజయంతో మంచి ఉత్సాహంలో ఉన్న హీరోయిన్ సాన్య మల్హోత్రా తన జీవితంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ముంబైలో ఎన్నాళ్లుగానో కలగా చూసుకున్న స్వంత ఇంటిని ఆమె తాజాగా కొనుగోలు చేశారు. కొత్త ఇంటిలోకి సాంప్రదాయ పద్ధతిలో గృహప్రవేశం నిర్వహించి అడుగుపెట్టిన సాన్య, ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సాన్య పంచుకున్న ఫోటోల్లో ఆమె కొత్త ఇల్లు ఎంతో విలాసవంతంగా, అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంటి బాల్కనీ నుంచి అరేబియా సముద్రం అందాలు స్పష్టంగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంటే సీ వ్యూ ఉన్న ఇంటిని కొనాలన్న ఆమె కల నిజమైంది. ఇంటి అంతా ప్రకాశవంతంగా ఉండేలా పెద్ద కిటికీలు ఏర్పాటు చేయడం, ఆధునిక డిజైన్‌తో రూపొందించిన ఇంటీరియర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. గృహప్రవేశ పూజ సందర్భంగా సాన్య పింక్ కలర్ చీరలో తలపై కలశం పెట్టుకుని శాస్త్రోక్తంగా ఇంట్లోకి అడుగుపెట్టిన దృశ్యాలు ప్రత్యేకంగా కనిపించాయి.తన కొత్త ఇంటిపై సాన్య భావోద్వేగంగా స్పందిస్తూ ఒక నోట్ కూడా రాశారు. “హర హర మహాదేవ్… ఎన్నో సంవత్సరాల కలలు, కష్టం, ఎదుగుదలకు ప్రతిరూపమే ఈ ఇల్లు. ఓర్పు, నమ్మకం ఉంటే ఫలితం ఎంత అందంగా ఉంటుందో ఈ ఇంటి ప్రతి మూల నాకు గుర్తు చేస్తోంది” అని పేర్కొన్నారు. అలాగే “నా ప్రయాణంలో కుటుంబం, స్నేహితులు చూపిన నమ్మకం నాకు పెద్ద బలం. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు, నా జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం. వెల్‌కమ్ టు మై ఘర్” అని ఆమె తెలిపారు. సాన్య పోస్ట్‌పై బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, శ్వేతా త్రిపాఠి, పుల్కిత్ సామ్రాట్ సహా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.ఇదిలా ఉండగా, కెరీర్ పరంగా కూడా సాన్య మల్హోత్రా బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల వరుణ్ ధావన్, జాన్వీ కపూర్‌లతో కలిసి Sunny Sanskari Ki Tulsi Kumari సినిమాలో కనిపించిన ఆమె, త్వరలో రాజ్‌కుమార్ రావుతో కలిసి Toaster అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీలో నటించనున్నారు. అదేవిధంగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో బాబీ డియోల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న Bandar సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా సాన్య మల్హోత్రా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించారు. Kathal, Pagglait, Love Hostel, Meenakshi Sundareshwar వంటి చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన Mrs. సినిమాతో కూడా ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దీంతో ఓటీటీ హీరోయిన్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఏర్పడింది.
Latest News