|
|
by Suryaa Desk | Sat, Mar 14, 2026, 08:57 PM
ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆది, సోమవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, పోలవరం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్ల కింద నిలబడరాదని, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Latest News